Musk-Rubio: ట్రంప్ ఎదుటే.. మస్క్, విదేశాంగ మంత్రి వాగ్వివాదం 1 y ago
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలోనే ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఎలాన్ మస్క్ గొడవ పడ్డారు. ఉద్యోగుల తొలగింపు విషయంలో వీరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. రూబియో ఉద్యోగులను తొలగించడం లేదని మస్క్ విమర్శించారు. దీనికి కౌంటర్‌గా ఇప్పటికే 1500 మంది ఉద్యోగులను తొలగించామని రూబియో వెల్లడించారు. మళ్లీ వారిని విధుల్లోకి తీసుకొని తొలగించాలా? అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు.